Previous
Download for
Laptop |
Tablet |
SmartPhone |
BasicPhone
This app works offline; all videos are included within the app.
కోడలు గర్భవతి అయినప్పుడు, వారు ఆమె యొక్క సంపూర్ణ బాధ్యతలు తీసుకోవడంతోపాటుగా, ఆమెకు సౌకర్యాన్ని కలిగించడం, ఆకుకూరలు, పప్పుధాన్యాలు, గుడ్లు,పాలు మరియు పళ్లు వంటివాటిని సరైన మొత్తాల్లో కలిగిన పౌష్టికాహారాన్ని ఇచ్చేందుకు మహిళలు వాగ్ధానం చేయాలి. ఐయడనైజ్డ్ సాల్డ్తో వండిన ఆహారాన్ని ఇవ్వాలి, అలానే ఆమెకు క్రమం తప్పకుండా ఫోలిక్ యాసిడ్ మాత్రలు ఇవ్వాలి.
గర్భధారణ సమయంలో తమ భార్యల సంపూర్ణ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించేలా యువకులు వాగ్ధానం చేయాలి. ఆమె సకాలంలో తినేలా మరియు తగినంత విశ్రాంతి తీసుకునేలా చూడాలి. ఏడోనెలల నుంచి, తమ బిడ్డకు స్తన్యంతోపాటుగా, ఇంటిలో వండిన వైవిధ్యభరితమైన ఆహారాలను బిడ్డకు అందించడం కొనసాగించాలి.
తమ నవజాత శిశువుకు తొలి పాలు (ముర్రపాలు) ఇవ్వడంతోపాటుగా, మొదటి ఆరునెలలపాటు కేవలం తల్లిపాలు ఇచ్చేట్లుగా మహిళలు వాగ్ధానం చేయాలి. బిడ్డలు ఏడోనెలలలోనికి ప్రవేశించిన తరువాత, వారి పాలతోపాటుగా, ఇంట్లో తయారు చేసిన ఆరోగ్యవంతమైన ఆహారాన్నిసైతం వారికి ఇవ్వడం ప్రారంభించాలి.
18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగిన బాలిక శారీరకంగాను మరియు మానసికంగా తల్లి బాధ్యతలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండదు. అటువంటి పరిస్థితిలో, ఆమె బిడ్డకు పోషకాహార లోపం సంభవించే ప్రమాదం ఉంటుంది. అందువల్లనే, మీ బిడ్డకు కనీసం 18 సంవత్సరాలు నిండకుండా వివాహం చేయాలని పరిగణించవద్దు.
తమ బిడ్డకు 18 సంవత్సరాలు నిండకుండా వివాహం చేయమని తల్లిదండ్రులు వాగ్ధానం చేయాలి. తద్వారా ఆమెకు భవిష్యత్తులో పుట్టే బిడ్డకు పౌష్టికాహార లోపం లేకుండా చూడవచ్చు.
18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఆడవారిని వివాహం చేసుకోమని తద్వారా తమ బిడ్డకు భవిష్యత్తులో పౌష్టికాహార లోపం సంభవించదని యువకులు వాగ్ధానం చేయాలి.
18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఆడపిల్లల వివాహాలు తమ గ్రామంలో జరగకుండా చూడటం తద్వారా తన గ్రామంలో ఏ బిడ్డ కూడా పౌష్టికాహార లోపంతో బాధించబడకుండా ఉండేలా చూడటం కొరకు సర్పంచ్ (గ్రామ పెద్ద) వాగ్ధానం చేయాలి.
పోషకాహార లోపం వల్ల చోటు చేసుకునే సంకేతాలు, ప్రమాదకరమైన పరిమాణాల గురించి మరియు తీసుకోవాల్సిన చర్యల గురించి సమాజాన్ని ప్రోత్సహించడం మరియు పోషకాహార లోపాన్ని నిరోధించుకోవడానికి చేయగల సరళమైన పనుల గురించి వివరించడమే ఈ వీడియో ప్రధాన ఉద్దేశ్యం.
సమాజంలోని అధిక సంఖ్యాకులకు ఇది ఉద్దేశించబడింది.
అందించిన వారు: మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, భారతదేశ ప్రభుత్వం మరియు ఇతర అభివృద్ధి భాగస్వాముల యొక్క క్రియాత్మక మద్దతుతో