Previous Next
Download for
Laptop |
Tablet |
SmartPhone |
BasicPhone
This app works offline; all videos are included within the app.
బిడ్డ పుట్టిన గంటలోపు తల్లిపాలు చిక్కగా ఉంటాయి, తల్లి మొదటిపాల (ముర్రుపాలు)ను బిడ్డకు విధిగా ఇవ్వాలి. ఇది ఎంతో ఆవశ్యకం. తల్లి యొక్క మొదటిపాలు ఎంతో శ్రేష్టమైనవి, వాటిని పారబోయవద్దు మరియు అవి తప్పకుండా పిల్లలకు అందేట్లుగా చూడాలి.
ముర్రుపాలు ఎంతో ఆవశ్యకం, తరువాత రోజుల్లో బిడ్డ అందుకునే పాలను స్వీకరించేవిధంగా బిడ్డ జీర్ణవ్యవస్థను సిద్ధం చేస్తుంది. ముర్రుపాలలో జింక్, కాల్షియం మరియు విటమిన్లు ఉంటాయి.
బిడ్డ పుట్టిన మొదటి ఆరునెలల పాటు బిడ్డకు కేవలం తల్లిపాలను మాత్రమే ఇవ్వాలి, నీళ్లు లేదా ఇతర ఏ పదార్థాలు ఇవ్వరాదు. 6నెలలపాటు అధికంగా పాలు ఇవ్వడం వల్ల డయేరియా లేదా న్యూమోనియా వంటి సాధారణ శిశు రుగ్మతల నుంచి రక్షణ లభించడం వల్ల శిశు మరణాలు తగ్గుతాయి మరియు అస్వస్థత సమయంలో వేగంగా కోలుకోవడానికి దోహదపడుతుంది.
ఏడో నెల నుంచి, శిశువు యొక్క పోషకాహార అవసరాలను తీర్చడం కొరకు తల్లిపాలు ఏ మాత్రం సరిపోవు. తల్లి పాలను వైవిధ్యమైన పోషకాహార డైట్‌తో సంతులనం చేయాలి. సకాలంలో, తగినమొత్తంలో, తగిన అనుబంధ ఆహారాలను ఇవ్వడం ప్రారంభించాలి. ఆరు నెలల తరువాత బిడ్డకు రోజుకు 3 నుంచి 4సార్లు ఆహారం ఇవ్వాలి. అలానే స్తన్యం ఇవ్వడాన్ని కొనసాగించాలి.
పోషకాహార లోపం వల్ల చోటు చేసుకునే సంకేతాలు, ప్రమాదకరమైన పరిమాణాల గురించి మరియు తీసుకోవాల్సిన చర్యల గురించి సమాజాన్ని ప్రోత్సహించడం మరియు పోషకాహార లోపాన్ని నిరోధించుకోవడానికి చేయగల సరళమైన పనుల గురించి వివరించడమే ఈ వీడియో ప్రధాన ఉద్దేశ్యం.
సమాజంలోని అధిక సంఖ్యాకులకు ఇది ఉద్దేశించబడింది.
అందించిన వారు: మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, భారతదేశ ప్రభుత్వం మరియు ఇతర అభివృద్ధి భాగస్వాముల యొక్క క్రియాత్మక మద్దతుతో